Kalvakuntla Kavitha పై కేసు నమోదు చేసేలా ఆదేశం ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన MP Dharmapuri Arvind

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-11-29 07:48:13  IST  )

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు

Kalvakuntla Kavitha పై కేసు నమోదు చేసేలా ఆదేశం ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన MP Dharmapuri Arvind
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కవితపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను కవిత దూషించారని, దాడులు చేశారని ఎంపీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. కాగా ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత అర్వింద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎంపీ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య రాజకీయంగా సిట్యుయేషన్ మరింత హీటెక్కింది. తాజాగా కవిత విషయంలో అర్వింద్ కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఉత్కంఠగా మారింది.

Read More: సోమాజిగూడలో తీవ్ర ఉద్రిక్తత.. ధ్వంసమైన కారులోనే ప్రగతిభవన్‌కు షర్మిల

Next Story