MP Chamala: ఫార్ములా రేసు కేసులో కీలకమైన వ్యక్తి కనిపించట్లేదు: ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

కుట్రలు, కుతంత్రాలకు నిలయం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) నిలయం.. అని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

MP Chamala: ఫార్ములా రేసు కేసులో కీలకమైన వ్యక్తి కనిపించట్లేదు: ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుట్రలు, కుతంత్రాలకు నిలయం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) నిలయం.. అని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ- కారు రేసు కేసు (Formula E race case) వ్యవహారం నేపథ్యంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS officer Arvind Kumar) కనిపించట్లేదని ఎంపీ చామల ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కీలకమైన వ్యక్తి అని చెప్పారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎక్కుడ ఉన్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన లేరు కాబట్టి కేసులో తనకు ఏమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు వెల్లడించారు.

చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ (KTR) ఏమైనా చేస్తారని ఆరోపించారు. గతంలో కేటీఆర్ మిత్రుడు కేదార్ విదేశాల్లో చనిపోయారని, కేటీఆర్ ప్లాన్‌తోనే ప్రభాకర్‌రావు అమెరికాకు వెళ్లి దాక్కున్నారని ఆరోపించారు. కాగా, కాగా, ఫార్ములా-ఈ కారు రేసు కేసులో దాదాపు 6 గంటల పాటు కేటీఆర్‌ను ఇవాళ ఏసీబీ అధికారులు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావలని అధికారులు కేటీఆర్‌కు సూచించినట్లు సమాచారం.

Next Story