జగదీష్ రెడ్డి ఎలుగుబంటి, కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్..ఎంపీ చామల షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

జగదీష్ రెడ్డి ఎలుగుబంటి, కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ అంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జ‌గదీష్ రెడ్డిని టైగ‌ర్ అంటాడ‌ని కానీ ఆయ‌న

జగదీష్ రెడ్డి ఎలుగుబంటి, కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్..ఎంపీ చామల షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: జగదీష్ రెడ్డి ఎలుగుబంటి, కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ అంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జ‌గదీష్ రెడ్డిని టైగ‌ర్ అంటాడ‌ని కానీ ఆయ‌న టైగ‌ర్ కాద‌ని, ఎలుగుబంటి అన్నారు. ఆయ‌న ఎప్పుడూ పైకి చూడ‌ర‌ని, కింద‌కి చూస్తూనే న‌డుస్తార‌ని తెలిపారు. పాడె కౌశిక్ రెడ్డి ఓట్లు వేయ‌క‌పోతే పాడెపై ప‌డుకుంటాన‌ని అన్నాడ‌ని, ఆయ‌న సూసైడ్ స్టార్ అని ఎద్దేవా చేశారు. వాళ్లిద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీష్ రావు గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను టాప్ చేస్తున్నారని జగదీష్ రెడ్డి విమర్శించడంలో అర్థం లేదన్నారు. తమ ప్రభుత్వంలో మంత్రులు అంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ప్ర‌జాపాల‌న‌ను అందించేందుకు ఐక్యంగా ముందుకు వెళుతున్నార‌ని చెప్పారు.

Next Story