- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంకా కేటీఆర్ బుద్ధి మారట్లేదు: కాంగ్రెస్ ఎంపీ ఫైర్
ఇంకా కేటీఆర్ బుద్ధి మారట్లేదు: కాంగ్రెస్ ఎంపీ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది.. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది’ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ టైంలో ఫాం హౌస్ పాలన తప్ప.. ప్రజా పాలన చేయలేదని అన్నారు. కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బ్లేమ్ చేయడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదని మండిపడ్డారు. అసలు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటని.. ఆయన కుటుంబంలో ఎంతమంది రాజకీయాల్లో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇంట్లో లాగా.. రేవంత్ ఇంట్లో ఎవరికీ పదవులు లేవు కదా అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు మంచి చేయలేదు.. మేము చేస్తుంటే చేయనియ్యట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించడం ఏంటని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టినా కేటీఆర్ బుద్ధి మారడం లేదని అన్నారు.






