MP Chamala Kiran: నీ దోస్తుల కోసమే ఈ కార్ రేస్.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఆరోపణలు

by Ramesh Naini |

తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత నీది కేటీఆర్.. అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

MP Chamala Kiran: నీ దోస్తుల కోసమే ఈ కార్ రేస్.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత నీది కేటీఆర్.. అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టకు (KTR) కేటీఆర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. నువ్వు మహా డ్రామా రావు అని ప్రజలకు తెలుసు.. నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో మేమే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంత లాగా మీ నాయన నువ్వు వ్యవహారించారని ఆరోపించారు. నువ్వు ఒక యువరాజువు అని నీ దోస్తులకు దోచి పెట్టడం కోసమే (Formula-E Car Race) ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు.

ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది హైదరాబాద్‌కి తానే తీసుకొచ్చానని, దానిని కాపాడాలని అది హైదరాబాద్‌కి తలమానికం అని, అందుకోసమే హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని తెలిపారు. నిజ నిజాలు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఏస్ నెక్స్ట్ జెనరేషన్స్ గ్రీన్‌కో సంస్థ యాజమాన్యం నీకు అత్యంత దగ్గర మిత్రులని ఆరోపించారు. వారిని కాపాడటానికి సీజన్ 1కి వాగ్దానం చేసిన రూ. 90 కోట్ల చెల్లించని కారణంగా రూ. 30 కోట్లు ఇచ్చి, 60 కోట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్లు నోటీసులు జారీ చేసి, కాంట్రాక్టు రద్దు చేస్తామని చెప్తే, నీ మిత్రులు గ్రీన్ కో ప్రమోటర్స్‌ను నీ బాల్య మిత్రులను కాపాడడం కోసం అక్టోబర్ 2023లో హెచ్ఎండీఏ నిధుల నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేసి వారిని కాపాడినట్లు వివరించారు. దానికి గ్లోబల్ హైదరాబాదును కాపాడడం కోసమే అని గొప్పలు చెప్పారని విమర్శలు చేశారు. నీ మిత్రులకు తెలంగాణ సంపదను దోచిపెట్టినవ్ అని తెలంగాణ ప్రజలకు క్లియర్ గా తెలుసన్నారు.

Next Story