- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా కొరతపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఎంపీ చామల లేఖ
తెలంగాణలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటలకు సరిపడా యూరియా అందకపోవడంతో ఫర్టిలైజర్ షాపుల ముందు బారులు తీరుతూ ఆందోళన చెందుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటలకు సరిపడా యూరియా అందకపోవడంతో ఫర్టిలైజర్ షాపుల ముందు బారులు తీరుతూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్‌కు గాను తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు కేవలం 4.36 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సప్లై చేశారని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన యూరియాను వెంటనే సప్లై చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి సైతం జేపీ నడ్డాతో భేటీలో యూరియా కొరత రాకుండా చూడాలని కోరారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులను అందించాలని కోరారు. దానికి నడ్డా రైతుల అవసరాలను తీర్చడానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా అన్ని జిల్లాలకు సరిపడా చేరవేయాలని అధికారులకు సూచించారు. ఇక సమస్య తీరకపోవడంతో ఎంపీ చామల ఆయనకు మరోసారి లేఖ రాసి యూరియా సరఫరా చేయాలని గుర్తు చేశారు.






