- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎంపీ చామల కిరణ్ ఫిర్యాదు.. ఎందుకంటే..?
పదేళ్లలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్లలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీశ్‌రావు (Harish Rao) అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కల్వకుంట్ల కవిత అందించిన ఆధారాలతో యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సంతోష్ రావు, హరీశ్ రావు, నవీన్ రావుపై ఎంపీ చామల ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీ చామల మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులపై కవిత (Kalvakuntla Kavitha) చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సంపదను దోచుకొని, కేవలం రెండు ఏళ్ల పాలన చేసిన కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే భూస్థాపితం అవుతోందని ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీపై చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికలో ఎవరి సత్తా ఏంటో తెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.






