- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాల్లోకి సీఎం ఎలా వచ్చారో తెలుసా..? కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కౌంటర్
కేటీఆర్ వ్యాఖ్యలపైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ వ్యాఖ్యలపైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మెస్సీలా భావించి రేవంత్ రెడ్డితో ఫుట్ బాల్ ఆడాలని తహతహలాడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి మీతో ఫుట్ బాల్ ఆడరు..మిమ్మల్ని ఆల్ రెడీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరూ లేరని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్ గా జెడ్సీటీసీగా గెలిచి సీఎం స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మీ నాన్న పిలిచారని వచ్చి ఇక్కడా ఉన్న నాయకులను కాదని కేటీఆర్ సిరిసిల్లలో పోటీ చేసి వంద ఓట్లతో గెలిచారన్నారు. కేటీఆర్ ది ఐరన్ లెగ్ అని మీ బావ, చెల్లె, కార్యకర్తలు బయట మాట్లాడుతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన పుణ్యంతోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చిందని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు.
రేవంత్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ తో కేటీఆర్ లో ఫ్రస్టేషన్ పెరిగిందని, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మీ రాజకీయ భవిష్యత్ ఖతం అయిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మీరు 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, కేంద్రానికి ట్యాక్స్ రూపంలో వెళ్లే ప్రతి రూపాయిని రేవంత్ రెడ్డి తీసుకువచ్చే ప్రయత్నమని, అందుకే ఢిల్లీ టూర్ లకు వెళ్తున్నట్టు ఎంపీ చామల చెప్పారు. కేటీఆర్ సోది కబుర్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీ వైపు చూడరని, తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ కోల్పోయిందన్నారు.
బాధ్యతగా తెలంగాణకు నిధులు తేవాలి..
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోడీ బీజేపీ ఎంపీలను పిలిచి చివాట్లు పెట్టారని, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితికి కిషన్ రెడ్డి కారణం అని మోడీ గమనించారని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మోడీని ప్రసన్నం చేసుకునేందుకు కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాశారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ సొమ్మును దోచుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడితే కిషన్ రెడ్డి ఎందుకు లెటర్లు రాయలేదని ఆయన ప్రశ్నించారు. ఐటీ, సీబీఐ,ఈడీ ద్వారా కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లు దోచుకోకుండా ఎందుకు కిషన్ రెడ్డి అడ్డుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం కిషన్ రెడ్డి బాధ్యతగా రాష్ట్రానికి నిధులు తేవాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.






