- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress MP: బండి సంజయ్ ఇప్పుడు కార్పొరేటర్ కాదు.. ఆ విషయం గుర్తుందా? లేదా?
కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్‌లో ఇంకా కార్పొరేటర్ లక్షణాలు పోలేదని విమర్శించారు. ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నానని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఓట్ చోరీ(Vote Chori) గురించి మాట్లాడితే.. దానిని పక్కకు నెట్టి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద క్లియర్‌గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకే ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయి. ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలతో సహా బయపెట్టారని గుర్తుచేశారు. బెంగళూరులో కూడా అక్రమాలు జరిగాయని అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబడితే ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. నిజంగా ఓట్ చోరీ జరగకపోతే చర్చ జరపాలి కదా అని అన్నారు. ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేవలం రాజకీయం మాట్లాడారు. ఒక్క జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు అని మండిపడ్డారు.






