- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ దొంగతనం బయటపడింది.. జగన్ కామెంట్స్‌పై ఎంపీ చామల రియాక్షన్
ఏపీ మాజీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ దొంగతనం బయటపడిందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ దొంగతనం బయటపడిందన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు. ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
తను సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ తో మాట్లాడి కృష్ణా నదీ జలాలను అక్రమంగా తీసుకువెళ్లినట్లు జగన్ చెప్పారని అన్నారు. కృష్ణా నదీ జలాలను ఎక్కువ టీఎంసీలు ఏపీకి తరలించడంలో తను సక్సెస్ అయ్యానని, చంద్రబాబు ఫెయిల్ అయ్యారని జగన్ చెప్పారని అన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో తెలంగాణ రైతులను మోసం చేశానని జగన్ చెప్పారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, జగన్ లాలూచీ పడి తెలంగాణ నీళ్లను అక్రమంగా ఏపీకి తరలించారని ఆరోపించారు. జగన్ వ్యాఖ్యలతో తెలంగాణకు అన్యాయం జరిందని తేటతెల్లమైందన్నారు.






