మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్ విషం కక్కుతోంది : ఎంపీ చామల

by Ajay Maddhiboyina |

బీజేపీ, బీఆర్ఎస్ మైనార్టీల‌పై విషం క‌క్కుతున్నాయ‌ని ఎంపీ చామ‌ల విమ‌ర్శించారు. రెండు పార్టీలు అజారుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌కుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నాయ‌ని అన్నారు. మైనార్టీలు అంటే ఎందుకు అంత క‌డుపుమంట అని ప్ర‌శ్నించారు. తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ మంత్రి ఉండ‌వ‌ద్దా అని ప్ర‌శ్నించారు.

మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్ విషం కక్కుతోంది : ఎంపీ చామల
X

దిశ,వెబ్ డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ మైనార్టీల‌పై విషం క‌క్కుతున్నాయ‌ని ఎంపీ చామ‌ల విమ‌ర్శించారు. రెండు పార్టీలు అజారుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌కుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నాయ‌ని అన్నారు. మైనార్టీలు అంటే ఎందుకు అంత క‌డుపుమంట అని ప్ర‌శ్నించారు. తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ మంత్రి ఉండ‌వ‌ద్దా అని ప్ర‌శ్నించారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే మ‌తాల మ‌ధ్య చిచ్చు పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్వ‌తంత్య్రం రాక‌ముందు అయినా వ‌చ్చిన త‌ర‌వాత అయినా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఐక్యం చేస్తూ ముందుకు వెళ్లింద‌ని చెప్పారు. కానీ ఈ రోజు బీజేపీ కేవ‌లం మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టి రాజ‌కీయంగా ప‌బ్బం గడుపుకుంటోంద‌న్నారు.

తెలంగాణ‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మ‌క్కై గుండు సున్నా తెచ్చుకుని మ‌రీ గెలిపించింద‌న్నారు. ఈ మ‌ధ్య‌నే వారి మ‌ధ్య ఉన్న సంబంధం గురించి క‌విత చెప్పార‌ని అన్నారు. కాంగ్రెస్ ఒక మైనార్టీని, భార‌త జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించిన అజారుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటే బీజేపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసింద‌న్నారు. బీఆర్ఎస్ కు లాభం జ‌ర‌గాల‌నే బీజేపీ ఇలా చేసింద‌ని విమ‌ర్శించారు. గ‌తంలో బీజేపీ రాజ‌స్థాన్ లోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిని క‌రారు చేసి ముందే మంత్రిప‌ద‌వి ఇచ్చారన్నారు. బీజేపీనే అలాంటి నిర్ణ‌యం తీసుకుని ఇప్పుడు అజారుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ఇస్తుంటే అడ్డుకుంటుంద‌ని ఆరోపించారు.

Next Story