- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ వల్ల తెలంగాణకు ఒరిగిందేమి లేదు.. కేటీఆర్‌పై ఎంపీ చామల విమర్శలు
మేము లేనిదే తెలంగాణ రాలేదు అనే మాయ మాటలు చెప్తూ, కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మీ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమి లేదని, నీళ్లు కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి వెళ్లాయి.. నిధులు వల్ల కుటుంబ సభ్యులుకి వెళ్లాయి..నియామకాలు ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు మీ కుటుంబ సభ్యులకే వచ్చాయని ఎంపీ చామల ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మేము లేనిదే తెలంగాణ రాలేదు అనే మాయ మాటలు చెప్తూ, కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మీ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమి లేదని, నీళ్లు కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి వెళ్లాయి.. నిధులు వల్ల కుటుంబ సభ్యులుకి వెళ్లాయి..నియామకాలు ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు మీ కుటుంబ సభ్యులకే వచ్చాయని ఎంపీ చామల ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అప్పులు రాష్ట్రంలా ఉండక పోతే ఎంతో అభివృద్ధి చెందేదని, వేల కోట్లు రూపాయలు కేంద్రం నుండి, ప్రతి శాఖ నుండి తెలంగాణకు వచ్చేదని ఆయన తెలిపారు.
రాష్ట్రం కేంద్రం మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో కేంద్రం నుండి నిధులు రావడం ఆగిపోయాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేటీఆర్ ది కొత్త ఆటో అవతారమని విమర్శించారు. పదేళ్ల పాలనలో ఏ ఒక్కరోజు కూడా ఆటో వారిని పట్టించుకొని కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఆటో వారి యోగక్షేమాలు గుర్తుకొచ్చాయని మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 42 కోట్ల రూపాయల చలాన్ల విధించారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంటఇంటి భారం తగ్గించేందుకు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు.. మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం..1,06,000 పైగా జీరో టికెట్స్ మహిళలకు అందించామని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
పదేళ్ల పాలన తర్వాత తెలంగాణ పూర్తిగా చీకటి అయ్యిందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తుంటే విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ దే అని, ఇందిరమ్మ ఆసరా పెన్షన్స్.. ప్రజాపాలన ప్రభుత్వంగా కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజలు కోసం పని చేస్తోందని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హాయాంలో ఆ పార్టీ నేతలు ఎన్నో మాటలు చెప్పి చేతులు ఎత్తివేశారని, రెండెళ్లలో ప్రజాప్రభుత్వం నాలా, చెరువులు, మురుగు నీటి మల్లింపు, మురికి వాడల అభివృద్ధి లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు. మీ హయాంలో ఎక్కడ ఏమి కట్టారో చెప్పాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టిన ధ్యాస ఇంకా దేని పైనలేదని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు.






