స్టూడెంట్ యూనియన్ ల జీవితాలతో కేటీఆర్ చెలగాటం: ఎంపీ చామల

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంతమంది స్టూడెంట్ యూనియన్ లను జమచేసి వారి జీవితాలతో చెలగాట మాడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

స్టూడెంట్ యూనియన్ ల జీవితాలతో కేటీఆర్ చెలగాటం: ఎంపీ చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంతమంది స్టూడెంట్ యూనియన్ లను జమచేసి వారి జీవితాలతో చెలగాట మాడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మూడేళ్లలో అధికారంలోకి వస్తామని అవగాహనలేని వ్యాఖ్యలు చేస్తూ, విద్యార్థి సంఘాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తాము ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల తాట తీస్తామని కేటీఆర్ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేసినా బుద్దిరావడం లేని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు. అయినా కేటీఆర్ అదిగో ఎన్నికలు, ఇదిగో ఎన్నికలు అంటూ తాటాకు చప్పుడులు చేస్తున్నాడని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా బుద్దిరాలేదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మారథం పట్టీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తారని పగటి కలలు కంటున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలును చూసి తట్టుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

ఢిల్లీలో రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగిన కుల గణన గురించి మాట్లాడితే మాట్లాడలేరని ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డినీ ముఖ్యమంత్రిగా చూడటం ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బనకచర్ల విషయంపై చంద్రబాబు జలశక్తి శాఖ మంత్రిని కలిస్తే హడావిడి చేశారు. తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో అసలు విషయం తేటతెలమైనది. సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రేవంత్ రెడ్డిని అభినందిస్తూ రాసిన లేఖపై కూడా కేటీఆర్ లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారని అన్నారు. సీఎంను ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ గా చూపించాలని కేటీఆర్ తహ తహలాడుతున్నాడని అన్నారు. గ్యారంటీలు, వెల్ఫేర్ స్కీంలు, కుల గణన అన్ని కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, కేసీఆర్ ఏ ఊర్లోకి వెళ్లిన నలుగురిని కూర్చోబెట్టు కొని డ్రామా చేస్తున్నాడని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు కనిపిస్తాయి. ఇది సంక్షేమ పాలన కాదా అంటూ ప్రశ్నించారు.

మీ 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఏ ఒకటి మీ ప్రభుత్వం అమలు చేయలేదు. కుటుంబ సభ్యుల ఫోన్లు టాపింగ్ చేసి అధికార దుర్వినియోగం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఓటు వేయకపోతే చస్తాని బ్లాక్ మెయిల్ చేసిన కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 16 మంది హీరోయిన్ల ఫోన్ టాపింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని తిడితే ఫేమస్ అవుతారని వీరందరూ మీడియా ముందుకు వస్తున్నారని ఆరోపించారు. మరో మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, వారి ఆశీర్వాదం మాకు ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోనే మాసత్తా తెలుస్తుందని అన్నారు. BRS గత పది సంవత్సరాలు ఎనిమిది లక్షల కోట్లు దోచుకుందని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినాకూడా తెలంగాణ ప్రజలు మీ మాటలు నమ్మడం లేదు. మీరు త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చారని మీరు భావిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల త్యాగాలు 1600 మంది బలిదానంతో తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.

Next Story