తెలంగాణలో మాదిరిగానే దేశంలో కులగణన చేయాలి: ఎంపీ చామల

by Ajay Maddhiboyina |

కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో మాదిరిగానే దేశంలో కులగణన చేయాలి: ఎంపీ చామల
X

దిశ‌, వెబ్ డెస్క్: కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేర‌కు కుల‌గ‌ణ‌న పూర్తి చేశామ‌ని చెప్పారు. రాహుల్ క‌శ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు చేసిన పాద‌యాత్రలో పరిస్థితుల‌ను గ‌మ‌నించి జనాభా శాతం ఆధారంగా కుల‌గ‌ణ‌న అవ‌స‌ర‌మ‌ని చెప్పారన్నారు. తెలంగాణలో శాస్త్రీయభద్దంగా కులగణన జరిగిందని గుర్తుచేశారు.

తెలంగాణలో చేసిన కులగణను కేంద్రం మంచి నిర్ణయంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే కేంద్ర కేబినెట్ దేశం మొత్తం కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో చేయబోయే జనాభా లెక్కల లెక్కింపులో భాగంగా కులగణన పూర్తి చేయాలని భావిస్తోంది. కులగణన జరిగితే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Next Story