రెచ్చగొడితే రెచ్చిపోకండి: ఆర్టీసీ కార్మికులకు MP సూచన

by Gantepaka Srikanth |

ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకండని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రెచ్చగొడితే రెచ్చిపోకండి: ఆర్టీసీ కార్మికులకు MP సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకండని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్‌గౌడ్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని.. ఆర్టీసీ ఉద్యోగులెవరూ అధైర్యపడకండని కోరారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నదని.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాపాలన కోసం పనిచేస్తుందని చెప్పారు. కొంతమంది తమ స్వలాభం కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రాణాలు ముఖ్యం అని.. మన వెనుక కుటుంబ సభ్యులు ఉన్నారని ఆలోచించాలన్నారు.

Next Story