రానున్న రోజుల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ రూట్ మ్యాప్ అదే.. ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేసింది అందరికీ తెలుసని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రానున్న రోజుల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ రూట్ మ్యాప్ అదే.. ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీజేపీ (BJP) 8 ఎంపీ సీట్ల గెలుపుకోసం, బీజేపీ, బీఆర్ఎస్ (BRS) పార్టీలు చేసింది అందరికీ తెలుసని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లోనూ ఈ పార్టీలు అదే రూట్ మ్యాప్‌లో వెళ్ళనున్నారని హాట్ కామెంట్స్ అన్నారు. తాజాగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు నియామకం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తీసుకున్న రూట్ మ్యాప్ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసలు ఢిల్లీ నుంచి తెలంగాణకు అమిత్ షా ఎందుకు వచ్చారో తెలియదని అన్నారు.

నిన్న పసుపు బోర్డు ప్రారంభం కోసం (Amit Shah) అమిత్ షా వచ్చారని, గతంలోనే వర్చువల్‌గా పసుపు బోర్డు ప్రారంభించారని తెలిపారు. రాజకీయం కోసం తప్ప, ప్రజాసంక్షేమం లేదని అన్నారు. సభలో అమిత్ షా కాంగ్రెస్‌ నేతలపై తప్పుడు వాఖ్యలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణలో దోచుకోలేదని, తెలంగాణలో దోచుకోవడానికి ఏమీ లేదన్నారు. మీరు ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుందని సూచించారు.

Next Story