- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi vs Chamala: అప్పుడు మీరు కరీంనగర్ కార్పొరేటర్‍గా ఉన్నారు.. బండికి ఎంపీ చామల కౌంటర్
బీఆర్ఎస్ పుణ్యంతోనే బీజేపీ 8 లోక్ సభ సీట్లు గెలిచారని బండి సంజయ్ కి చామల కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం చెందితే రాష్ట్ర హక్కుల కోసం బీజేపీ పోరాటం చేసిందని ఇవాళ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై చామల స్పందించారు. నీళ్ల విషయంలో పోరాటం చేయడంలో బీజేపీ పాత్ర ఉందని బండి సంజయ్ (Bandi Sanjay) అంటున్నారు.. కానీ నాగార్జున సాగర్, శ్రీశైలం, సింగూరు, కడెం లాంటి ప్రాజెక్టులతో పాటు కృష్ణా, గోదావరి బేసిన్‍లో ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే కట్టారన్నారని విషయం బండి సంజయ్ కు తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర బండి సంజయ్‍కు తెలియదని, అప్పుడు బండి సంజయ్ కరీంనగర్‍లో కార్పొరేటర్‍గా ఉన్నారన్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడికి పాల్పడుతుంటే బీజేపీ అడ్డుకోలేక బీజేపీ ప్రేక్షక పాత్ర పోషించిందని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీకి రాజకీయ మనుగడ లేదని బీఆర్ఎస్ పుణ్యమా అని బీజేపి 8 ఎంపీ సీట్లు వచ్చాయని సెటైర్ వేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారని చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ వాటా కోసం బండి సంజయ్, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నదీ జలాలపై మాతో పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ చామల ఓ వీడియో రిలీజ్ చేశారు.






