- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ అంటేనే సీఎం కేసీఆర్‌కు భయం: ఎంపీ Bandi Sanjay
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో అంతా కలిసి పోరాడుతామని మాజీ టీ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో అంతా కలిసి పోరాడుతామని మాజీ టీ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే కేసీఆర్ భయపడిపోతున్నారని అన్నారు. అందుకే ఆందోళన చేసే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని బండి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, యువతను కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్‌తో కేసీఆరే చెప్పిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర నుండి బీఆర్ఎస్‌లో చేరుతున్నావారంతా ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేవారేనని అన్నారు.
Read more : disha newspaper






