MP Dharmapuri Arvind ఆరోపణలు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్

by Sathputhe Rajesh |   (  Updated:2023-07-17 09:39:40  IST  )

ఎంపీ అర్వింద్ చేసిన ఆరోపణలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

MP Dharmapuri Arvind ఆరోపణలు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ అర్వింద్ చేసిన ఆరోపణలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డబుల్ బిల్లులు తీసుకున్నామని ఆరోపణలు చేస్తున్నారని.. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద ఇచ్చిన రూ.300 కోట్లతో రూ.70 కోట్లు కేటాయించామన్నారు. డబుల్ బిల్లింగ్‌కు ఆస్కారమే లేదన్నారు. అర్వింద్ కు కనీస అవగాహన లేదన్నారు. కష్టపడుతున్న తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నిధులు పక్కదారి పట్టలేదన్నారు. తనపై ఎంపీ అర్వింద్ చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేసుకోవచ్చన్నారు. అయితే నిన్న ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కవిత దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారన్నారు. బాల్కొండలో కట్టే ప్రతి బ్రిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తుందన్నారు. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే.

Next Story