జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు ఆరోపణలు.. ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-10-23 06:48:51  IST  )

రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావొచ్చని ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు ఆరోపణలు.. ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్ (Jubilee Hills bypoll) తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్‍గా మారింది. ఇక్కడ జెండా పాతేందుకు అన్ని పార్టీలు తమ ప్రత్యర్థులను డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అభ్యర్థి విషయంలో పెద్ద ఎత్తున కసరత్తు చేసి అందరికంటే ఆఖరున అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ పార్టీ తిరిగి పాత అభ్యర్థినే తెరపైకి తీసుకురావడం వెనుక ఏం జరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన అర్వింద్.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ-బీఆర్ఎస్ కలిసిపోయాయా (BJP, BRS alliance allegation) అన్న ప్రశ్నకు స్పందిస్తూ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ కిషన్ రెడ్డి (Kishan Reddy) పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని ఈ విషయంలో కిషన్ రెడ్డినే అడగాలన్నారు. అయితే తాను ఒక్కటి మాత్రం చెప్పగలనని పార్టీని కాంప్రమైజ్ చేస్తున్నారంటే కన్నతల్లితోటి వ్యాపారం చేస్తున్నట్లే లెక్క అని హాట్ కామెంట్స్ చేశారు. దానికంటే మించిన పాపం మరొకటి ఉండదని, కార్యకర్తల శాపం మీ తరతరాలకు తగులుతుందన్నారు. భవిష్యత్‍లో నూ బీఆర్ఎస్‍తో బీజేపీకి పొత్తుఉండబోదన్నారు. తాను చాలా సార్లు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‍షా ను కలిశానని ఇది ఈ రెండు పార్టీల మధ్య అలయెన్స్ ఇంపాజిబుల్ అని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావొచ్చు:

రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ బలపడే ప్రసక్తే లేదన్నారు. కానీ బీజేపీ పుంజుకోకుంటే బీఆర్ఎస్‍కు ఓటు శాతం పెరుగుతుందని ఇది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారుతుందన్నారు. తెలంగాణ రాజకీయం అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండబోతోందని బీఆర్ఎస్ తిరిగి బలపడటం అసాధ్యం అని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని మరోసారి సీఎం కూడా కావొచ్చని అన్నారు. పరిపాలన విషయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపోయినా రాజకీయంగా టికెట్లు సరిగ్గా ఇచ్చుకోవడం వల్లే అధికారంలోకి రాగలిగారన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని డ్రామాలు అని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీకి ఓటమి రుచి చూపించిందే నేను అని చెప్పారు.

Read More: ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్‌కు ఆమోదం.. CM, CSకు మంత్రి జూపల్లి సంచలన లేఖ

Next Story