- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Arvind: రేవంత్, కవిత ఎప్పటికీ ఆప్తమిత్రులే.. ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికుతోందని.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2029 ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికుతోందని.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2029 ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు. ఇవాళ ఆయన నిజామాబాద్ (Nizamabad)లో పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సభలో అర్వింద్ మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన ఎఫ్‌పీవో (FPO) నిధులను రైతులు సద్వియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
హిందూ రాష్ట్ర నిర్మాణానికి పునాది వేసింది ఇందూరు గడ్డ అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నాయని కామెంట్ చేశారు. గతంలో బిజినెస్ పార్ట్‌నర్లుగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy), కవిత (Kavitha) ఎప్పటికీ ఆప్తమిత్రులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్ది విశ్వగురువుగా చేయడమే ప్రధాని లక్ష్యమని అన్నారు. పహల్గాం టెర్రర్ అటాక్‌కు కౌంటర్‌గా పాక్‌పై తప్పకుండా బదులు తీర్చుకుంటామని తెలిపారు. కానీ, అందుకు సమయం వచ్చినప్పుడు ఉగ్రవాదులకు బలమైన జవాబే ఉండబోతోందని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.






