MP Arvind: రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసింది కేసీఆర్: ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాష్ట్ర రాజకీయాలను సర్వనాశనం చేసింది కేసీఆరే (KCR) అని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు.

MP Arvind: రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసింది కేసీఆర్: ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాలను సర్వనాశనం చేసింది కేసీఆరే (KCR) అని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బాల్యం నుంచి చూస్తూ పెరిగిన నాయకుల కంటే కేసీఆర్ (KCR), కవిత (KCR) చాలా చిన్న స్థాయి నాయకులు అంటూ సెటైర్లు వేశారు. రాజకీయ విలువలను కేటీఆర్ (KCR) కుటుంబం అధ:పాతాళానికి తొక్కేసిందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) రాష్ట్రంలో టీడీపీ (TDP), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రజా క్షేత్రంలో ఉన్నప్పటికీ పరస్పరం విమర్శలు చేసుకున్నారని గుర్తు చేశారు.

కానీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పుట్టాక రాజకీయాల్లో ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతల భౌతిక దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్న పదేళ్లు ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. ప్రభుత్వం పథకాల అమలులో పింక్ పార్టీ విపరీతమైన అవినీతికి పాల్పడిందని అన్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి మరోసారి బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన విషయం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. స్వరాష్ట్ర సాధనకు అందరితో పాటే కేసీఆర్ (KCR) కోట్లాడిండని.. 2014 వరకు ఆయనపై గౌరవం ఉండేదని అన్నారు. అధికారం చేతికొచ్చాక మనిషి మారిపోయాడని తెలిపారు. నెత్తి మీద టోపీ పెట్టుకునే వాళ్లు తప్ప.. ప్రజలెవరూ మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకోవడం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

Next Story