- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెగులు స్క్రైబ్ అనే ట్విట్టర్

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెగులు స్క్రైబ్ అనే ట్విట్టర్ పేజీ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలపై ఆరోపణలు చేస్తూ ఓ కంటెస్టెంట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ కంటెస్టెంట్ తప్పుకోవడానికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మరో కాంగ్రెస్ నేత కారణం అంటూ తెలుగు స్క్రైబ్ ట్విట్టర్ పేజీలో ప్రచారం చేశారు. ఆ తరవాత చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇద్దరి పేర్లను ప్రచారం చేశాయి. ఇప్పటికే తెలుగు స్క్రైబ్ అడ్మిన్‌ను అదుపులోకి తీసుకోగా అది బీఆర్ఎస్ వాళ్లది అని తనకు సంబంధం లేదని చెప్పారు. ఎంపీ ఫిర్యాదుపై విచారణ తరవాత అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.
Next Story






