BC Reservations: సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యపై క్లారిటీ ఇచ్చిన తల్లి

by Ramesh Naini |

అందు కోసమే నా కొడుకు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని సాయి ఈశ్వరాచారి తల్లి ప్రమీల క్లారిటీ ఇచ్చారు.

BC Reservations: సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యపై క్లారిటీ ఇచ్చిన తల్లి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసమే నా కొడుకు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని సాయి ఈశ్వరాచారి తల్లి ప్రమీల క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ.. సాయి చనిపోయి వారం రోజులు అయినా, ప్రభుత్వం ఏం సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల కోసం సాయి ఇంత చేస్తే, ఆదుకోవడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదన్నారు. సాయికి ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నారని, వాళ్లని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అలాగే సాయి ఈశ్వరాచారి సోదరుడు నందీశ్వర్ మాట్లాడుతూ.. మా అన్న సాయి ఎల్లప్పుడూ బీసీల గురించే మాట్లాడేవాడని, ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పేవాడన్నారు. కానీ, తనే ఒక అడుగు ముందుకు వేసి, ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. మా అన్నయ్యే కుటుంబానికి పెద్ద దిక్కు.. ఆయన చనిపోవడంతో పెద్ద దిక్కు లేకుండా పోయిందని ఆవేదన చెందారు. కాగా, ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈశ్వరాచారి మరణాన్ని బీసీ ఉద్యమానికి లింక్ పెట్టాలని మల్లన్న చూస్తున్నారని పలువురు యూట్యూబర్స్ ఆరోపణలు చేశారు. మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలులో అన్యాయం జరిగిందని సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నట్లు బీసీ, దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నారు. వీడియో..

Next Story