మియాపూర్‌‌లో 3 ఏళ్ల చిన్నారిపై దారుణం.. ప్రియుడితో కలిసి కన్న కూతురిని వేధించిన తల్లి

by Ramesh Naini |

మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

మియాపూర్‌‌లో 3 ఏళ్ల చిన్నారిపై దారుణం.. ప్రియుడితో కలిసి కన్న కూతురిని వేధించిన తల్లి
X

దిశ, శేరిలింగంపల్లి: మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధి(Miyapur Police Station)లో దారుణం చోటుచేసుకుంది. పాపం పుణ్యం తెలియని మూడేళ్ల కన్న కూతురిని, సవతి తండ్రితో కలిసి వేధింపులకు గురి చేసింది ఓ మహిళ. స్థానికుల ఫిర్యాదుతో చిన్నారిని చిత్రహింసలు పెడుతున్న తల్లిని, ఆమె ప్రియుడిని తాజాగా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ హఫీజ్ పేట్ ప్రాంతానికి చెందిన

షబానా నాజ్విన్ కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయి తన మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ఆమె జావేద్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. ఈ నెల ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలను గమనించిన స్థానికులు.. ఆ గాయాల గురించి చిన్నారిని ఆరా తీశారు. సవతి తండ్రితో కలిసి తన తల్లి ప్రతిరోజు కొడుతోందని, ఇద్దరూ కలిసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆ చిన్నారి కన్నీటి పర్యంతం అయింది. చిన్నారి ఒంటిపై ఉన్న గాయాలపై తీవ్రంగా స్పందించిన స్థానికులు. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేసిన మియాపూర్ పోలీసులు అనంతరం చిన్నారి కన్నతల్లి షబానా నాజ్విన్, సవతి తండ్రి జావేద్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి బారి నుంచి చిన్నారిని రక్షించిన పోలీసులు ఆ పాపను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. విషయం తెలుసుకున్న చిన్నారి కన్నతండ్రి, బాబాయ్ ఆమెను తమ ఇంటికి తీసుకువెళ్లారు.

Next Story