- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. మదర్ డెయిరీ MD కృష్ణ సస్పెండ్
మదర్ డెయిరీ మాజీ ఎండీ బెలిదె కృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ కే.లింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మదర్ డెయిరీకి ఆర్థికంగా నష్టం చేస్తూ, తన బినామీలతో అక్రమ ఆస్తులు కూడగట్టారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు వినిపించాయి.

దిశ, నల్లగొండ బ్యూరో: మదర్ డెయిరీ మాజీ ఎండీ బెలిదె కృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ కే.లింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మదర్ డెయిరీకి ఆర్థికంగా నష్టం చేస్తూ, తన బినామీలతో అక్రమ ఆస్తులు కూడగట్టారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు వినిపించాయి. ఒకరిద్దరు చైర్మన్‌లను తన వైపు తిప్పుకొని ఇష్టారాజ్యంగా వివరించారని విమర్శలున్నాయి. తనకు అనుకూలంగా లేని చైర్మన్‌లను పదవి నుంచి తప్పించడానికి కూడా ఆయన కుట్రలు చేశారని అప్పట్లో ఆరోపణ వినిపించాయి. నార్మక్స్ ఆస్తులను అమ్మకానికి కూడా ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఒకనాడు వందలాదిమంది రైతులకు అన్నం పెట్టిన మదర్ డెయిరీ ఈనాడు సంస్థకు పాలు పోసిన రైతులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వలేని దుస్థితి చేరిందంటే దానికి మాజీ ఎంపీ కృష్ణ కూడా ఓ కారణమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కే.లింగారెడ్డి.. సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీయగా దానికి ప్రధాన కారణం మాజీ ఎండీ కృష్ణ అని తేలింది. దీంతో ఆయన విధులు నుంచి తప్పించారు. 18 సంవత్సరాల క్రితం సంస్థలో సామాన్య ఉద్యోగిగా చేరిన కృష్ణ నేడు దాదాపు రూ.500 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. అంతేకాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మేనేజర్ దశరథ, పాసింగ్ సూపర్వైజర్ పరమేష్ రెడ్డిని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. పరమేష్ రెడ్డి బెలిదె కృష్ణకు బినామీగా ఉన్నారని సమాచారం. మదర్ డెయిరీలో అవినీతి తిమింగలం ఇటీవల దిన పత్రికలో కథనం కూడా ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.






