LOC: భారత్- పాక్ బార్డర్.. ఉదయం కూల్, నైట్ టెన్షన్.. మోడీ స్పీచ్ ముగియగానే జరిగింది ఇదే..

by Prasad Jukanti |

భారత్-పాక్ బార్డర్ లో ఉదయం కూల్ వాతావరణం కనిపించగా సాయంత్రం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

LOC: భారత్- పాక్ బార్డర్.. ఉదయం కూల్, నైట్ టెన్షన్.. మోడీ స్పీచ్ ముగియగానే జరిగింది ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత వారం రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న భారత్- పాకిస్తాన్ బార్డర్ (India-Pak border) ప్రాంతాల్లో క్రమంలో ప్రశాంతత నెలకొంటోంది. ప్రస్తుతం భారత్- పాక్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణతో ఎల్వోసీ (LoC) లో నిశ్శబ్ధం నెలకొంది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir), పంజాబ్ సరిహద్దు జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు (Schools, Colleges) మళ్లీ తెరుచుకున్నాయి. ఇండియా సరిహద్దుల్లో పరిస్థితి అంతా కంట్రోల్ లోనే ఉందని ఇండియన్ ఆర్మీ చెప్పింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. జైసల్మేర్ లో ఉదయం నుంచే ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారు. అమృత్ సర్, హోషియాపూర్, గురుదాస్ పూర్ లలో బ్లాకౌట్ ఎత్తివేశారు.

రాత్రి పాక్ దాడి:

నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Modi) జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగం ముగిసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఎల్ఓసీ వెంబడి జమ్మూ కాశ్మీర్ లోని సాంబ సమీపంలో రాత్రి పూట డ్రోన్ల కదలికలు కనిపించాయి. పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను భారత సైన్యం నిర్వీర్యం చేసింది. అదే జిల్లాలోని ఒక సరిహద్దు గ్రామంలోని స్థానికులు నిన్న రాత్రి పేలుళ్ల శబ్దాలు విన్నామని, తమ ఇళ్లలో కొన్ని శకలాలు పడ్డాయని తెలిపారు. పాకిస్తాన్ జరిపిన కాల్పుల కారణంగా తమ ఇంటి పైకప్పులు, వంటగదులు కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు వెల్లడించారు. పాక్ చర్యల కారణంగా నిరంతరం భయంతో గడిపామని చెప్పారు. దీంతో బార్డర్ లో రాత్రి టెన్షన్, ఉదయం కూల్ వాతావరణం కనిపిస్తోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Next Story