- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో 500 ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు.. ఆందోళన
ఇండిగో విమానాల రద్దు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : సాంకేతిక కారణాలతో ఇండిగో విమానాయాన సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపెడుతోంది. గత మూడురోజులుగా విమాన సర్వీసులను రద్దు (IndiGo flights cancellations) చేస్తున్న ఆ సంస్థ.. తాజాగా మరో 500 ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది. వీటిలో ఢిల్లీ నంచి వెళ్లాల్సిన 220, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన/రావాల్సిన 90 విమానాలు ఉన్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad) ప్రయాణికులు గంటల తరబడి వేచిచూస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. వారు ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆందోళనకు దిగారు. తమకు కనీసం తాగు నీరు, ఆహారం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో స్థలం సరిపోక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమలకు వెళ్లాల్సిన భక్తులది ఇదే పరిస్థితి నెలకొంది. తాము ఇప్పటికే అయ్యప్ప స్వామి స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని, చివరి నిమిషంలో విమానం రద్దు చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేట్‌కు అడ్డంగా బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇండిగో షేర్లు ఢమాల్
మూడు రోజులుగా విమానాలు రద్దు చేస్తుండడంతో స్టాక్ మార్కెట్‌లో ఇండిగో షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్‌లో ఇండిగో షేరు ధర 2.16 శాతం తగ్గింది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఇండిగో డీజీసీఏను సంప్రదించింది. ఎయిర్‌బస్ ఏ-320 విమానాలకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. అయితే, డీజీసీఏ ఇండిగో అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.






