- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మరిన్ని వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
రాష్ట్రంలో రానున్న రెండురోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రానున్న రెండురోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కొన్ని చోట్ల 30 నుంచి 40 డిగ్రీల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ననగర్, నాగర్ కర్నూల్ వనపర్తి, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు:
అలాగే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్ -41.8
భద్రాచలం - 36.2
హకీంపేట్ - 37.6
దుండిగల్ - 37.5
హన్మకొండ - 36
హైదరాబాద్ - 36.4
ఖమ్మం - 37.4
మహబూబ్ నగర్ - 37.6
మెదక్ - 41.2
నల్గొండ - 39
నిజామాబాద్ - 42
రామగుండం - 38.6
రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరుగుతాయని మూడురోజుల పాటు వర్షాలు కురిసరే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీ వాతావరణ పరిశోధన కేంద్రం రాష్ట్ర రైతాంగానికి పలు సూచనలు చేసింది.. గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు36 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావొచ్చు.
రైతలకు సూచనలు:
-తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసరే అవకాశం ఉన్నందున కోసిన పంటలైన వరి, మొక్కజోన్న, శనగ, పెసర, మినుము, జొన్న, పొద్దు తిరుగుడు, నువ్వులు పంటను మందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వర్ష సూచనలున్నందున తాత్కాలికంగా పురుగుమందుల పిచికారీ వాయిదా వేసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో పచ్చిమేత కోసం జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గత ప్రాంతాల్లో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలు వేసుకోవచ్చు. అధికంగా పంటలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి నీటిని తీసివేసిన తర్వాత పంట త్వరగా కోలుకోవటానికి ఎరువులు వేసుకోవాలి. హైదరాబాద్ లో శుక్రవారం భారీగా వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 8 సెం.మీ వర్షాపాతం నమోదైనట్లు పేర్కొంది.
- Tags
- weather news






