- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీనే కాదు మున్సిపల్ ఎన్నికలకూ కోతుల ఎఫెక్ట్
మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో కోతుల బెడద ఏ స్థాయిలో ఉందో తెలిసింది. చాలా గ్రామాల్లో ముందు కోతులను తరిమి తరవాత ఓట్లు అడగాలని బోర్డులు దర్శనం ఇచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో కోతుల బెడద ఏ స్థాయిలో ఉందో తెలిసింది. చాలా గ్రామాల్లో ముందు కోతులను తరిమి తరవాత ఓట్లు అడగాలని బోర్డులు దర్శనం ఇచ్చాయి. ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థే కొండముచ్చు వేశం వేసుకుని కోతులను భయపెడుతూ గ్రామంలో తిరిగాడు. కాగా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఓ కార్పోరేటర్ అభ్యర్థి ఎన్నికలకు ముందే వార్డులోకి కొండముచ్చును తీసుకువచ్చి కోతులను తరిమేస్తున్నాడు.
ఈ ఘటన భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. 16వ వార్డులో పోటీ చేసేందుకు సిద్ధమైన మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ వార్డులో కోతుల సమస్య ప్రధానంగా ఉండటంతో వాటిని తరిమేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందే ఓ కొండముచ్చును పట్టుకుని వార్డులో తిరిగారు. ఇక పంచాయితీ ఎన్నికల్లోనూ ఇలాంటి సన్నివేశాలే కనిపించడంతో కోతుల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. అంతే కాకుండా గ్రామాల్లోనే కాకుండా మున్సిపాలిటీల్లోనూ కోతులే ప్రధాన సమస్య అని స్పష్టం అవుతోంది.






