సర్పంచ్ ఎన్నికలకు మానిటరింగ్ కమిటీ

by Gantepaka Srikanth |

సర్పంచ్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ అధిష్టానం మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయబోతోంది.

సర్పంచ్ ఎన్నికలకు మానిటరింగ్ కమిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ(Telangana BJP) అధిష్టానం దృష్టి సారించింది. ఎన్నికలకు త్వరలో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కావడంతో సర్పంచ్ పదవులకు పోటీచేసే నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజా రిజర్వేషన్ల మార్పుతో తమకు అనుకూలంగా మారడంతో ప్రజల మెప్పు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఎన్నికల తేదీ నాటికి ఒక ఊపు తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.

Next Story