TG: మొక్కజొన్న రైతులకు శుభవార్త

by Gantepaka Srikanth |

TG: మొక్కజొన్న రైతులకు శుభవార్త

TG: మొక్కజొన్న రైతులకు శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో నేటి నుంచి జమచేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీంతో 55,904 మంది రైతులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేనప్పటికీ, రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వమే పంట సేకరణ చేపట్టిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న రైతుల నుండి సేకరించినట్లు వెల్లడించారు. సేకరించిన ధాన్యానికి గాను రూ.588 కోట్లు నేటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్టు వెల్లడించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలనేదే తమ మొదటి ప్రాధాన్యమని మంత్రి తెలిపారు.

Next Story