- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దుబాయ్ లింకులు.. భారీగా ఆర్థిక లావాదేవీలు!
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెరపైకి కొత్తపేరు వచ్చింది. ఈ కేసుకు, దుబాయ్ లో చనిపోయిన వ్యక్తికి సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case) దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, గత ఏడాది దుబాయ్‌లో మరణించిన కేదార్‌కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను పోలీసులు బట్టబయలు చేశారు. డ్రగ్స్ పార్టీల నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న కేదార్‌కు, రోహిత్‌రెడ్డి, రితేష్‌ల బ్యాంక్ ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రూ. 25 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్లతో సహా ఆధారాలు సేకరించారు. డ్రగ్ పార్టీ నిర్వాహకులకు కేదార్ ద్వారానే ఈ నిధులు అందినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
మౌనం వీడని నిందితులు
పోలీసు కస్టడీలో ఉన్న రోహిత్‌రెడ్డి, రితేష్‌లను ఈ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించగా, వారు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఈ డబ్బును ఎందుకు పంపారు? దేనికోసం కేదార్‌తో అంత పెద్ద మొత్తంలో డీల్ కుదిరింది? అన్న ప్రశ్నలకు వారు స్పష్టత ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. గత ఏడాది దుబాయ్‌లో డ్రగ్స్ ఓవర్ డోస్‌తోనే కేదార్ మృతి చెందిన నేపథ్యంలో.. ఈ కేసు మూలాలు అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో ఏమైనా ముడిపడి ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. కేదార్ మరణించినా, అతని ఫోన్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా రోహిత్‌రెడ్డితో జరిపిన సంభాషణలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సేకరించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌లో ఇంకెంతమంది ప్రముఖులు ఉన్నారనే అంశంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.






