హైదరాబాద్‌లో మొదలైన మోడీ రోడ్ షో.. కాషాయమయమైన RTC క్రాస్ రోడ్స్

by Satheesh |   (  Updated:2023-11-27 12:35:32  IST  )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి ప్రధాని మోడీ

హైదరాబాద్‌లో మొదలైన మోడీ రోడ్ షో.. కాషాయమయమైన RTC క్రాస్ రోడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. కాగా, ఈ రోడ్ షో ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి ప్రారంభం అయ్యింది. డప్పులు, డ్యాన్సులతో ప్రధాని మోడీకి కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మోడీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో రోడ్ షో సాగే మార్గం సందడిగా మారింది. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారు. ప్రధానిపై పూల వర్షం కురిపిస్తూ అభిమానం చాటుకుంటున్నారు. ప్రధాని రోడ్ షోకు భారీగా జనం తరలిరావడంతో.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణ గూడ, చిక్కడపల్లి రోడ్లు కాషాయమమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ నిర్వహిస్తోన్న ఈ రోడ్ షో.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వయా నారాయణగూడ, చిక్కడపల్లి, వైఎంసీఏ నుండి కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో సాగనుంది. మొత్తం రెండున్నర కిలోమీటర్ల ప్రధాని రోడ్ షో సాగనుంది.

Next Story