- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓబీసీలకు అన్యాయం చేస్తోన్న మోడీ ప్రభుత్వం: కాంగ్రెస్ నేత వి.హెచ్ ఆరోపణలు
దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు ఇండియా కూటమి అండగా నిలబడిందని, ఓబీసీలకు ప్రధాని మోడీ అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు ఇండియా కూటమి అండగా నిలబడిందని, ఓబీసీలకు ప్రధాని మోడీ అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి కోసం మోడీ ఆగమేఘాలపైన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారని, మోడీ ప్రధానిగా మూడు సార్లు ఎన్నికైన బీసీల గురించి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కులగణన తెరపైకి వచ్చిందని, తెలంగాణలో ఊపు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తాము మోడీ కలిసి ఓబీసీలకు మంత్రి వర్గంలో ప్రత్యేక శాఖ, బడ్జెట్ కేటాయింపులు, కులగణన చేయాలని చెప్పామని, కానీ, కులగణనలో బీసీల మాట లేదని వీహెచ్ ఆరోపించారు.
బీసీలు ఓట్లు వేసే మిషన్లమా, మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండొద్దా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తీర్మానం చేస్తే కేంద్రం పట్టించుకోలేదని, డిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా నిరసనలు చేపట్టారన్నారు. రాహుల్ గాంధీ బీసీల్లో ఆదరణ వస్తుందని డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చారన్నారు. మోడీ ప్రతిపక్షాలు మహిళలకు అన్యాయం చేశారని మాట్లాడటం తగదని వీహెచ్ ఆక్షేపించారు. బీసీ పార్టీగా చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బీసీల గురించి పట్టదా? అని వీహెచ్ ప్రశ్నించారు. తాము కూడా మా హక్కుల గురించి దేశం అంతటా పర్యటిస్తామని, బీజేపీ నేతలు మహిళా బిల్లుపైన చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్ డీసీసీ చీఫ్మోత రోహిత్ ముదిరాజ్, నాంపల్లి ఇంచార్జి ఫిరోజ్ ఖాన్ లు పాల్గొన్నారు.






