మోడీ, పినరయి విజయన్ ఒక్కటే.. కేరళంలో ప్రచారంలో రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2026-04-01 06:23:15  IST  )

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముట్టతార రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మోడీ, పినరయి విజయన్‌లపై విమర్శలు గుప్పించారు.

మోడీ, పినరయి విజయన్ ఒక్కటే.. కేరళంలో ప్రచారంలో రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి, పినరయి విజయన్‍కు తేడా ఏమీ లేదని కేరళంలో సమస్యలకు ఈ ఇద్దరే కారణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తరఫున రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ముట్టతార (Muttathara) వద్ద నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళం ప్రజలు తెలివైన వారు, చదువుకున్న వారు. ఇక్కడి ప్రజలు ప్రజలు మతతత్వ శక్తులను ఎప్పటికీ అనుమతించరన్నారు. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖ గీశారన్నారు.

భవిష్యత్ అపహరించాలని చూస్తున్నారు:

నరేంద్ర మోడీ, పినరయి విజయన్ ద్వారా కేరళం భవిష్యత్‍ను అపహరించాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంకును పినరయి విజయన్‍కు ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తూ కేరళంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలవకూడదని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించి.. కేరళంను అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

సోనియా వల్లే తెలంగాణ అభివృద్ధి:

సోనియా గాంధీ తెలంగాణను దత్తత తీసుకున్నారని ఆమె చొరవ వల్లే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోగలుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ ఆశీర్వాదం ఆమె మద్దతుతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఇది కేరళం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అని వచ్చిందన్నారు.

బిజిబిజీగా సీఎం:

కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఉదయం ఉదయం 9.30 గంటలకు SM లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు జరిగే రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. 11 గంటలకు త్రివేండ్రంలోని భారతన్నూర్( Bharathannur)లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ కు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు పూవాచల్ వద్ద (కట్టక్కడ నుండి పూవాచల్ , వెల్లండ్ వరకు) రోడ్ షో లో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అలప్పుజ( Alappuza) వద్ద కార్నర్ మీటింగ్ కు హాజరై అనంతరం ఎర్నాకులం చేరుకోనున్నారు.

Next Story