తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రానున్న 3 గంటల్లో ఈ పలు ప్రాంతాల్లో వర్షాలు

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో మళ్లీ వర్షాలు (Telangana Rains) దంచికొడుతున్నాయి.

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రానున్న 3 గంటల్లో ఈ పలు ప్రాంతాల్లో వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మళ్లీ వర్షాలు (Telangana Rains) దంచికొడుతున్నాయి. గత రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 4 గంటలపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. పలు చోట్ల వర్షపునీటిలో వాహనాలు కొట్టుకుపోయాయి. ముషీరాబాద్ లో ఓ యువకుడు గల్లంతై మరణించాడు. తాజాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. జనగామ, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల కింద నిలబడవద్దని సూచించింది. హైదరాబాద్ లో వాతావరణం.. సాయంత్రం వరకూ పొడిగా ఉంటుందని, రాత్రికి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weather Man) అంచనా వేశారు.

Next Story