- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాగల రెండ్రోజుల పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉండటంతో పలు జిల్లాలకు 'ఎల్లో అలెర్ట్' జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని సూచించింది.
పెరగనున్న ఎండ తీవ్రత
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల పగటిపూట ఉక్కపోత అధికంగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్న ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమరం భీం అసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నాయాయణ్ పేట్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.






