- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ డేట్ ఫిక్స్
by Gantepaka Srikanth |
తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నట్లు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నట్లు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 21 నుంచి హాల్ టిక్కెట్లు telanganams.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి రాత పరిక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగుతుంది. 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు.
Next Story






