- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకే ఫైల్స్‌తో మొబైల్ హ్యాకింగ్: సైబర్ నేరగాళ్ల హవా
సైబర్ నేరాల కింద నమోదవుతున్న అత్యధిక కేసులలో చాలా వరకు భయం, ఆత్యాశకు సంబంధించినవే ఉంటున్నాయి. వీటిలో ఎక్కువగా ట్రేడింగ్, షేర్ మార్కెట్ పెట్టుబడులలో సంబంధించినవి కాగా, మరికొన్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగేవి ఉన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్ నేరాల కింద నమోదవుతున్న అత్యధిక కేసులలో చాలా వరకు భయం, ఆత్యాశకు సంబంధించినవే ఉంటున్నాయి. వీటిలో ఎక్కువగా ట్రేడింగ్, షేర్ మార్కెట్ పెట్టుబడులలో సంబంధించినవి కాగా, మరికొన్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగేవి ఉన్నాయి. సిమ్ వేరిఫికేషన్, జంప్ డిపాజిట్, పార్ట్ టైం జాబ్ ఆఫర్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, లోన్ పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇటీవల నవీన్ మిట్టల్ అనే ఐఏస్ అధికారి పేరుతో ఫేస్ బుక్ మేసెంజర్ ద్వారా సైబర్ నేరగాళ్లు మేసేజ్ చేయగా, ఓ వ్యక్తి రూ.90 వేలు ట్రాన్సఫర్ చేశాడు. తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు.
డగ్స్ సేవిస్తూ మీ అబ్బాయి పట్టుబడ్డారని, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, మనీ ల్యాండరింగ్ కేసులో ఉన్నారని, ఇలా పలు రకాల కారణాలు చెబుతూ డిజిటల్ అరెస్ట్ రూపంలో మోసగాళ్లు కొట్లు కొల్లగొడుతున్నారు. వారం రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో భాధితులను మోసం చేసిన ఘటనలు ఉన్నాయి. గత సంవత్సరం నమోదైన ఈ తరహా కేసులో హైదరాబాద్ కు చెందిన బాధితురాలు రూ.5.6 కోట్లు సైబర్ నేరగాళ్ళకు ట్రాన్స్‌ఫర్ చేసింది.
వాట్సప్ లో ఏపీకే ఫైల్స్ తో మొబైల్స్ హ్యాకింగ్
వాట్సప్ లో ఏపీకే ఫైల్స్ పంపి, మొబైల్స్ హ్యాకింగ్ కు పాల్పడటం ఇటీవలి కాలంలో అధికంగా జరుగుతోంది. కిసాన్ యోజన స్కీమ్, ఎస్ బీఐ రివార్డ్ పాయింట్, ఆర్ టీవో చలానా, వెడ్డింగ్ ఇన్విటేషన్.. ఇలా చాలా పేర్లతో ఏపీకే ఫైల్స్ పంపుతూ, మొబైల్స్ ఫోన్స్ ను హ్యాక్ చేస్తున్నారు. దానిలోని డేటాను చోరీ చేస్తున్నారు. గ్రూప్ లో ఉండే నెంబర్లకు డబ్బులు పంపాలని మేసేజ్ లు పంపుతున్నారు.
ఏపికే ఫైల్ ను డిలీట్ చేయాలి..
మొబైల్ ఫోన్ హ్యాకింగ్ కు గురైన వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ఎపికే ఫైల్ ను మొబైల్ లో గుర్తించి వెంటనే దానిని డిలీట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్ గురైందో లేదో తెలుసుకునేందుకు సంబంధిత బ్యాంక్ ను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్ డిలీట్ చేయనంత వరకు బాధితుడి ఫోన్ సైబర్ నేరగాళ్ల పరిధిలో ఉంటుందని సైబర్ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ట్రేడింగ్ మోసాలు అధికం
సైబర్ క్రైమ్ లలో ట్రేడింగ్ , షేర్ మార్కెట్ పేరుతో జరిగేవి అధికంగా ఉంటున్నాయి. ఇటీవల ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరు రూ.850 కోట్ల రూపాయల మేరకు ట్రేడింగ్ ద్వారా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
మంచిర్యాలకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ట్రేడింగ్ లో రూ.87లక్షలు పోగొట్టుకున్నాడు. చైనాకు చెందిన ఓకేకే ఎక్సెంజ్ సంస్థకు చెందిన షేర్స్ కోనుగోలు చేసి, మోసపోయినట్లు సైబర్ బ్యూరో గుర్తించింది. రూ.2.38లక్షల మాత్రమే నిందితుని నుంచి రాబట్టగలిగిగారు.
బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ లా నటిస్తూ ప్రిమియం సర్వీస్ కలిగిన క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తామంటూ, ఓ బాధితుడి నుంచి సైబర్ మోసగాళ్లు రూ.77 లక్షలు కొట్టేసినట్టు సైబర్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. గిఫ్ట్ ల రూపంలో మొబైల్ ఫోన్లను పంపిస్తూ, సిమ్ అందులో వేయగానే హ్యకింగ్ కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసులు తెలిపారు.
గోల్డెన్ అవర్ సద్వినియోగ పరచుకోవాలి : శిఖా గోయల్, డీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి ఫిర్యాదు చేసి, గోల్డెన్ అవర్ ని సద్వినియోగం చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు. ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నగదు ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ ప్రభుత్వ అనుమతులు పొందిదా లేదా అనేది తెలుసుకోవాలి. పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే మేసేజ్ పట్ల కూడా జాగ్రత్త వహించాలని శిఖా గోయల్ సూచించారు. జాతీయ లోక అదాలత్ లో కూడా పలు కేసులను పరిష్కారించామని తెలిపారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్టపడుతుందని శిఖా గోయల్ సూచించారు.






