తెలుగు సాహితీ వినీలాకాశంలో ధ్రువతార.. జయంతి వేళ సినారెకు ఎమ్మెల్సీ కవిత నివాళి

by Kema Shiva Kumar |

తెలుగు కవి, సాహితీ‌వేత్త సింగిరెడ్డి నారాయణ రెడ్డి (Singireddy Narayana Reddy) జయంతి నేడు.

తెలుగు సాహితీ వినీలాకాశంలో ధ్రువతార.. జయంతి వేళ సినారెకు ఎమ్మెల్సీ కవిత నివాళి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు కవి, సాహితీ‌వేత్త సింగిరెడ్డి నారాయణ రెడ్డి (Singireddy Narayana Reddy) జయంతి నేడు. ఈ క్రమంలోనే తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన ఆయనను గుర్తు చేసుకుంటూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్వీట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. తెలుగు సాహితీ వినీలాకాశంలో ధ్రువతార అని కొనియాడారు. తన విశ్వంభర రచనతో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సాహితీ సౌరభమని పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తున్నా అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

Next Story