- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో వారిదే కీలక పాత్ర!
ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ(Telangana Cabinet) విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ(Telangana Cabinet) విస్తరణకు రంగం సిద్ధమైంది. కొత్తగా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కృషి చేశారు. వారి చొరవతో బీసీ నుంచి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎస్సీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌లకు మంత్రివర్గంలో స్థానం లభించగా, ఎస్టీ వర్గానికి చెందిన రామచంద్రు నాయక్‌కి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం వచ్చింది. సీఎం రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ చేసిన ముఖ్య సూచనలను కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకుని, సామాజిక న్యాయానికి మద్దతుగా నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాలన్న దిశగా పార్టీ హైకమాండ్‌ను ఒప్పించడంలో వీరిద్దరూ సఫలమైన తీరు ప్రశంసనీయమని పలువురు అభినందిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్న దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యతకు కట్టుబడి పనిచేస్తున్నదన్న విషయాన్ని ఈ నిర్ణయం మరోసారి రుజువు చేసిందంటున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న ముగ్గురితో పాటు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రునాయక్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు చెప్పారు.






