ముందస్తు సాగు ప్రణాళికలు.. పంట నష్టం జరుగకుండా చర్యలు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 13 |
ముందస్తు సాగు ప్రణాళికలు.. పంట నష్టం జరుగకుండా చర్యలు : పల్లా రాజేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్‌లో అకాల వర్షాలతో పంట నష్టం జరగకుండా ముందస్తు వరి సాగు ప్రణాళికలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 3న నిర్వహించే తెలంగాణ రైతు దినోత్సవ కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రైతు బంధు సమితి కార్యాలయంలో జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. దశాబ్ద కాలంలో వ్యవసాయ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధించామన్నారు.

2014-15 తో పోలిస్తే వరి ఉత్పత్తిలో దేశంలో 15వ స్థానం నుంచి ప్రథమ స్థానం, ఉత్పాదకతలో దేశంలోనే ద్వితీయ స్థానానికి చేరుకున్నామన్నారు. ఇది సీఎం కేసీఆర్ ఆదర్శ పాలనకు తార్కాణమని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందనరావు మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు దశాబ్ద కాలంలో రైతుల అభివృద్ధి కొరకు దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సమకూర్చిందన్నారు. అనంతరం తెలంగాణ రైతు దినోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed