- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రావు
సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. నేడు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. తీగ లాగితే డొంక కదిలిన మాదిరిగా.. ఈ కేసులో ఒక్కొక్కరినీ విచారించే కొద్దీ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నవీన్ రావు విచారణలో తన వెనుక ఎవరున్నారు? ఎవరితో చేయి కలిపారు? వంటి ప్రశ్నలు సిట్ అధికారులు సంధించినట్లు సమాచారం.
వారితో నాకు సంబంధం లేదు
సిట్ విచారణలో నవీన్ రావు ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానమివ్వలేదని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింక్ కేసు నిందితులైన ప్రణీత్ రావు, శ్రవణ్ కుమార్ లతో తనకు సంబంధాలున్నాయన్న ఆరోపణలను నవీన్ రావు ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు రాజకీయంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని నవీన్ రావు వాపోయారు. నిందితులతో తనకెలాంటి సంబంధం లేదని, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎప్పుడూ వారితో మాట్లాడలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. విచారణలో ఎమ్మెల్సీ నవీన్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేశారు.
సిట్ నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్, కేటీఆర్?
కాగా.. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా విచారించేందుకు సిట్ రెడీ అవుతోంది. త్వరలోనే వారిద్దరీ సిట్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.






