MLC Kodandaram: కలిసి పనిచేద్దాం.. సహకరించండి

by Gantepaka Srikanth |

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు ఎమ్మెల్సీ కోదండరాం కీలక విజ్ఞప్తి చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ(Telangana Secretariat) సంఘం ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్‌ను కలిసి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)తో కలిసి ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) ఆవిష్కరించారు.

MLC Kodandaram: కలిసి పనిచేద్దాం.. సహకరించండి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు ఎమ్మెల్సీ కోదండరాం కీలక విజ్ఞప్తి చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ(Telangana Secretariat) సంఘం ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్‌ను కలిసి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)తో కలిసి ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం.. సహకరించండి అని రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్, హెల్త్ కార్డ్స్ కోసం తన వైపున నుండి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే ఉద్యోగుల సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకు రావాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఉద్యోగులు మంచి సేవలు అందించి ప్రభుత్వం నకు గొప్ప పేరు తీసుకొని రావాలని కోరారు. ఈ సమావేశంలో సచివాలయ సంఘం ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ J ప్రేమ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమ కోసము నిరంతరం పనిచేస్తామని తెలిపారు. అనంతరం సంఘం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అందులో 13 అంశాలపై తీర్మానం, చర్చ మరియు ఆమోదం జరిగింది. ఈ కార్యక్రమం లో Dr. BR అంబేద్కర్ తెలంగాణా సచివాలయం సంఘం సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.




Next Story