నరమేధం ఆపండి.. నంబాల కేశవరావు ఎన్కౌంటర్‌ను ఖండించిన ఎమ్మెల్సీ కోదండరాం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-22 11:17:14  IST  )

కేంద్ర ప్ర‌భుత్వం న‌ర‌మేధాన్ని ఆపాల‌ని మావోయిస్టుల‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఎమ్మెల్సీ కోదండ‌రాం అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... మావో అగ్ర‌నేత నంబాల

నరమేధం ఆపండి.. నంబాల కేశవరావు ఎన్కౌంటర్‌ను ఖండించిన ఎమ్మెల్సీ కోదండరాం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్ర‌భుత్వం న‌ర‌మేధాన్ని ఆపాల‌ని మావోయిస్టుల‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఎమ్మెల్సీ కోదండ‌రాం అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... మావో అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్కౌంట‌ర్‌ను ఖండించారు. మనుషులను వెంటాడి చంపడం మానవతా విలువలకు, చట్టానికి విరుద్దం అని అన్నారు. కేశవరావు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఉన్నాయని, ఆయనను ఎక్కడో పట్టుకుని కాల్చి చంపారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.

ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మనుషులను ఈ విధంగా చంపడం ద్వారా ఒక రాజకీయాన్నో ఒక సిద్ధాంతాన్నో రూపు మాపాలనుకోవడం సరికాదన్నారు. అది అనవసర హింసకు దారి తీస్తుందని చెప్పారు. మనుషులను వెంటాడి చంపడాన్ని ఏ చట్టం కూడా అంగీకరించదని, అది మానవతావాదం కాదని అన్నారు. మావోయిస్టులు శాంతి చర్చలు కోరుకుంటున్నారని, కాబట్టి వారితో శాంతి చర్చలు జరిపి ఛత్తీస్‌గఢ్‌లో శాంతిని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story