ఎన్నో ఆవేదనల తర్వాతే లేఖ రాశా.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడ్డట్లు చరిత్రలో లేదు.. కేసీఆర్‌కు కవిత సంచలన విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-30 08:11:01  IST  )

తండ్రి కేసీఆర్‌(KCR)కు తాను రాసిన లేఖ బయటకు రావడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో ఆవేదనల తర్వాతే లేఖ రాశా.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడ్డట్లు చరిత్రలో లేదు.. కేసీఆర్‌కు కవిత సంచలన విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తండ్రి కేసీఆర్‌(KCR)కు తాను రాసిన లేఖ బయటకు రావడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. తన లేఖ ఎలా బయటకు వచ్చిందో.. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తేలాల్సిందే అన్నారు. నాకంటూ ప్రత్యేక జెండా.. అజెండా ఏమీ లేవు.. నా పార్టీ బీఆర్ఎస్సే.. నా నాయకుడు కేసీఆరే అని మరోసారి స్పష్టం చేశారు. పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన అజెండా అని చెప్పారు. పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరో నేత నాయకత్వాన్ని తాను ఒప్పుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. బీజేపీవైపు బీఆర్ఎస్ చూడొద్దు.. బీజేపీ(BJP)తో పొత్తు పెట్టుకొని బాగుపడ్డ పార్టీలు చరిత్రలో లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీలో చోటుచేసుకుంటున్న సమస్యలపై, పుట్టుకొస్తున్న కోవర్టుపై అధినేతకు లేఖ రాస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్నో ఆవేదనలు భరించలేక లేఖ రాశానని అన్నారు. తన మీద దృష్టి తగ్గించి ముందు లేఖ లీక్ చేసిన వారిని పట్టుకోండి అని అధిష్టానికి హితవు పలికారు. లేఖ రాయకముందే కేసీఆర్‌ను కలిసే అవకాశం వచ్చింది కానీ.. కలవలేకపోయా అని అన్నారు.

Next Story