- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ ఇచ్చిన హామీ గుర్తుచేసిన కవిత.. అవి కనిపించడం లేదా? అంటూ ఫైర్
నిజామాబాద్ పసుపు రైతుల(Pasupu Rythulu) ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ పసుపు రైతుల(Pasupu Rythulu) ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడిగారు. మాటలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. క్వింటాలు పసుపుకు రూ.15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డి(Revanth Reddy) హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపుకు కనీసం రూ.9 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే అని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) కనీసం రైతులను పరామర్శించడం లేదని సీరియస్ అయ్యారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదని అన్నారు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు.. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.






