- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Kavitha: తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు.. పునాదులు తవ్విన నాటి నుంచే ఈ ప్రాజెక్టుపై కొందరు పనికట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. పొరుగు రాష్ట్రం జలదోపిడీకి పాల్పడుతుంటే మనోళ్లు మన ప్రాజెక్టునే తప్పు బడుతున్నారు.. గోదావరి నది నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకునే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.. తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న అసత్య ప్రచారానికి ఇదే నా సమాధానం’ అంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్సీ కవిత పోస్టు చేశారు.
‘తెలంగాణకు కాళేశ్వరమే శ్రీరామరక్ష. ఈ ప్రాజెక్టుపై జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అక్కసు వెళ్లగక్కారు. 'ఏ కోణం లోనూ కాళేశ్వరాన్ని సమర్థించలేం' పేరుతో జూలై 2న ఓ దినపత్రికలో ప్రచురితమైన వ్యాసంలో ప్రాజెక్టు గురించి ఆయన అనేక అసత్యాలు రాశారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారడం.. దృష్టకరం’ అని MLC కవిత అసహనం వ్యక్తం చేశారు.






