- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 25న ముంబైకి ఎమ్మెల్సీ కవిత..
by Satheesh |
ముంబాయిలో ఈనెల 25న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ముంబాయిలో ఈనెల 25న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఓ ఛానల్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023' పేరిట నిర్వహించునున్న సదస్సులో '2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం' అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఆమె పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. బీఆర్‌ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా వివరించనున్నారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి తెలియజేయనున్నట్లు సమాచారం. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు. ఎమ్మెల్సీతో పాటు చర్చా వేదికలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ ఛడ్డా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ పాల్గొననున్నట్లు సమాచారం.
Next Story






